- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS శ్రేణులకు పద్మారావు గౌడ్ కీలక సందేశం
by Gantepaka Srikanth |
తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని.. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని బీఆర్ఎస్ కీలక నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రకటన విడుదల చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని.. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని బీఆర్ఎస్ కీలక నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత పనుల రీత్య ఆదివారం డెహ్రాడూన్‌కు వెళ్లానని.. ఛాతిలో స్వల్ప నొప్పి రావడంతో వెంటనే అక్కడే ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. తాను పూర్తిగా కోలుకున్నానని.. తన కార్యకలాపాలన్నీ యథావిధిగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో సీతాఫల్‌మండీలోని తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించారు.
Next Story






