- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Padi Koushik Reddy : పొంగులేటిపై పాడి కౌశిక్ రెడ్డి సెటైర్లు
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik Reddy) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)ని టార్గెట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik Reddy) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)ని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా "నిరుపేదలకోసం గొప్ప అవకాశం! ఇండ్లు లేని నిరుపేదలు, ఇందిరమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్(IRIS) ద్వారా మీ కలలను సాకారం చేసుకోండి. ఈ స్కీమ్ ద్వారా ఇండ్లకు దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే చర్యలు ప్రారంభించండి. మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలవండి" అంటూ ఓ వీడియో షేర్ చేశారు.
అందులో.. "తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డున ఎంత అద్భుతమైన ఇండ్లు కడుతున్నారో కింద వీడియోలో చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా. పొంగులేటి శ్రీనివాస్ గారు.. హైదరాబాద్‌లో ఉన్న పేదలందరూ కూడా ఈ ఇండ్లు ఎప్పుడు వాళ్లకిస్తారని ఎదురుచూస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు.. మీకు ఇందిరమ్మ మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఈ ప్రాజెక్టు చూసిన తర్వాతే అర్థమైంది. ఆ ప్రాజెక్టు పేరు.. ఐరిస్ (IRIS) అని పెట్టారు. ఇందిరమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అని పెట్టారు. కన్‌స్ట్రక్టెడ్ బై రాఘవ కన్‌స్ట్రక్షన్స్. మీ అభిమానానికి నిజంగా.. నేను ఆశ్చర్యపోతున్నా. పొంగులేటి శ్రీనివాస్ గారు దయచేసి ఇలాంటి అద్భుతమైన ఐరిస్ బిల్డింగ్‌ని మా హుజురాబాద్‌లో కూడా కట్టి పేదలకు పంచాలని చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తున్నా." అంటూ కౌశిక్ రెడ్డి నగరంలోని కాస్ట్లీ భవనాలను ఇందిరమ్మ ఇళ్లుగా ఎందుకు మార్చరు అంటూ చురకలు అంటించారు.






