ఇసుక కోసం చెక్ డ్యాం బ్లాస్ట్ చేశారు: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

by Ajay Maddhiboyina |

ఇసుక కోసం తనుగుల చెక్ డ్యాంను బ్లాస్ట్ చేశారని.. అక్కడ క్లియర్‌గా బ్లాస్ట్ చేసిన ఆనవాళ్లు కనిపించాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇసుక కోసం చెక్ డ్యాం బ్లాస్ట్ చేశారు: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇసుక కోసం తనుగుల చెక్ డ్యాంను బ్లాస్ట్ చేశారని.. అక్కడ క్లియర్‌గా బ్లాస్ట్ చేసిన ఆనవాళ్లు కనిపించాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నిజనిజాలు తెలియాలని.. రైతుల మేలు కోసం కేసీఆర్ అనేక మంచి పనులు చేశారని.. కానీ ఆ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్‌రెడ్డి అనుచరులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ పెట్టి హరీశ్‌రావుపై సవాల్ చేశారని.. బ్లాస్ట్ చేసినట్లు చూయిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటావని అని అన్నారని వెల్లడించారు. సవాల్‌ను స్వీకరించి వెంటనే రాజకీయాల్లో నుంచి తొలిగిపోవాలని సూచించారు.

బ్లాస్ట్ చేసిన వాస్తవాలు తాను చూపిస్తానని.. దమ్ముంటే విజయరామణారావు రాజకీయాల్లో నుంచి తప్పుకునే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. లేకుంటే రేవంత్‌రెడ్డిలా మాట తప్పుతారా అని ప్రశ్నించారు. బ్లాస్టింగ్ అయిందని స్వయానా ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ ఫిర్యాదు చేశారని.. పూర్తిగా ఆ ఏరియాలో జెలిటెన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేయడం కామన్ అయిపోయిందని అన్నారు. ఆ డ్యాంను రాఘవ కన్స్ట్రక్షన్ కట్టిందని.. వెంటనే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల మీద బండి సంజయ్‌కి ప్రేమ లేదని.. నాణ్యత లోపం ఉంటే వెంటనే సీబీఐ విచారణ చేయించాలని అన్నారు.

మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి బ్లాస్టింగ్ చేసి కూల్చారని.. మేడిగడ్డను బ్లాస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ గుండాలేనని.. దానిపైనా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఫేక్ లీడర్స్ ఉన్నారని, మాఫియా లీడర్లు మంత్రులు అయ్యారని ఆరోపించారు. కరీంనగర్ ప్రాంతంలో రెండు చోట్ల బ్లాస్ట్ చేశారని.. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు అయితే రెండోది తణుకుల చెక్ డ్యాం అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇసుక దందాకు పెద్ద ఎత్తున తెరలేపిందని.. అక్రమ సంపాదన కోసం చెక్ డ్యాంలను బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ డబ్బులను ఢిల్లీకి మూటలు పంపుతున్నారని అన్నారు.

Next Story