పాడి కౌశిక్ రెడ్డికి షాక్.. డీజీపీకి నివేదిక కోరిన హెచ్ఆర్సీ

by Prasad Jukanti |   (  Updated:2026-02-02 13:22:52  IST  )

వీణవంక ఘర్ణలో కరీంనగర్ సీపీపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.

పాడి కౌశిక్ రెడ్డికి షాక్..  డీజీపీకి నివేదిక కోరిన హెచ్ఆర్సీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇటీవల కరీంనగర్ జిల్లా వీణవంకలో పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు అందింది. పోలీస్ అధికారిని ఆయన మతం పేరుతొ దూషించారని TEAMRIES వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి ఇవాళ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కమిషన్ సభ్యులు శివాడి ప్రవీణ పరిశీలించి ఈ విషయంలో నివేదిక ఇవ్వాలని డీజీపీని కోరారు. ఈ నెల 20వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని కోరారు.

24 గంటల్లోపు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి:

ఫిర్యాదు సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాడి కౌశిక్‌రెడ్డి ముస్లింలపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిని 24 గంటల్లోపు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి మాటలతో మైనారిటీల పట్ల బీఆర్ఎస్ వైఖరి స్పష్టం అయిందని ఫహీం విమర్శించారు. కౌశిక్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని, మైనారిటీ పోలీస్ అధికారిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరం అన్నారు. నేను ప్రశ్నిస్తే కేటీఆర్ నన్ను బ్లాక్ చేశాడని ఆరోపించారు. తిట్టడం, తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పడం కౌశిక్ రెడ్డికి అలవాటేనని విమర్శించారు.

ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ సంఘం సీరియస్:

వీణవంకలో జరిగిన సమ్మక్క, సారలమ్మ జాతరలోకరీంనగర్‌ సీపీ ఆలం గౌస్‌‍పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేన్ సంఘం ఖండించింది. కరీంనగర్‌ సీపీ గౌస్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. సీపీ గౌస్‌ మత మార్పిడులపై పాల్పడుతున్నారంటూ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారంటూ ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. కరీంనగర్‌ సీపీపై మత మార్పిడి ఆరోపణలు నేను చేయలేదనవి ఒక వేళ నేను అలా అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాని చాలెంజ్ చేశారు. ఈ ఆరోపణలపై ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ప్రివిలేజ్‌ మోషన్‌ వేస్తానంటూ కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. ఈ వివాదం నడుస్తున్న క్రమంలో కౌశిక్ రెడ్డిపై తాజాగా హెచ్ఆర్సీలో ఫిర్యాదు అందడం హాట్ టాపిక్ గా మారింది.

Next Story