- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి పాదయాత్ర, శ్రమదానం
రేపటి నుంచి పాదయాత్ర, శ్రమదానం ప్రారంభించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

- ఆగస్టు 6 వరకు కొనసాగుతాయి
- పరిగిలో ప్రారంభమై వరంగల్ వర్ధన్నపేటలో ముగుస్తుంది
- పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: రేపటి నుంచి పాదయాత్ర, శ్రమదానం ప్రారంభించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమాలు ఆగస్టు 6 వరకు కొనసాగుతాయన్నారు. పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభమై వరంగల్ జిల్లా వర్ధన్నపేట వరకు సాగుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిగి, మెదక్ జిల్లాలో ఆందోల్, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేటలో జరుగుతాయని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఢిల్లీకి వెళ్లే కార్యక్రమం గురించి చర్చ ఉంటుందన్నారు. పది ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లతో మంగళవారం సమావేశం నిర్వహించామని, నామినేటెడ్ పోస్ట్ లపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు.
కార్పొరేషన్ల పోస్ట్ లు, డైరెక్టర్ల నియామకానికి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. బీసీ లపట్ల కవిత పది ఏండ్లు అధికారంలో ఉండీ బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఆమె బీసీల గురించి వల్కబోసినా ఎవరు నమ్మరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు చట్టాలు తీసుకొచ్చామని, ఎవరెన్ని చెప్పినా బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని అన్నారు. గంగుల కమలాకర్ పది ఏండ్లు మంత్రిగా ఉండీ బీసీల రిజర్వేషన్ ను తగ్గిస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముఖేష్ గౌడ్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడు. ఆయన, శివశంకర్ విగ్రహం పెట్టాలని అడుగుతున్నారు. సీఎంతో మాట్లాడి విగ్రహం పెట్టించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.






