- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు ముంగిట రాజకీయం: సహకార సంఘాల భవితవ్యంపై వీడని ఉత్కంఠ!
సహకార సంఘాలకు ఎన్నికలా? నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తారా? అనే చర్చ సంఘ సభ్యుల్లో సాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల కోసం ఆశావహులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. పదవీకాలం ముగిశాక కూడా ఏడాదిన్నరపాటు కొనసాగించిన ప్రభుత్వం గత నవంబర్‌లో పాలకవర్గాలను రద్దు చేసి పర్సన్ ఇన్‌చార్జిలను నియమించింది. అయితే వారి ద్వారా రైతులకు సరైన సేవలు అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈసారి ప్రభుత్వం పీఏసీఎస్‌కు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్లు, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలనే సమాలోచనలు చేస్తోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే నామినేటెడ్పద్ధతిలో నియమించాలని నిర్ణయానికి రాగా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర కోసం వేచిచూస్తున్నారు. ఏడాది కిందటే దీనిపై ప్రచారం జరగడంతో అధికార పార్టీకి చెందిన పలువురు ఆశావహులు మంత్రుల చుట్టూ తిరిగి అవకాశం కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తరువాత అవకాశం కల్పిస్తామని వారికి మంత్రులు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు సహకార సంఘాలకు ఎన్నికలా? నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తారా? అనే చర్చ సంఘ సభ్యుల్లో సాగుతోంది. నామినేటెడ్విధానం తీసుకురావడంపై రైతు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. పాత విధానంలో అమలు చేయాలని, పార్టీ కార్యకర్తల కోసం చేస్తే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నాయి.
పర్సన్ ఇన్‌చార్జిలతో పాలనా వైఫల్యం..
రాష్ట్రంలో 9 డీసీసీబీ బ్యాంకులతోపాటు 908 పీఏసీఎస్కేంద్రాలు రైతులకు సేవలందిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు ఇవ్వటంతోపాటు ఎరువులు, విత్తనాల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లలో కీలక పాత్ర వహిస్తున్నాయి. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై రుణాలు అందిస్తున్నాయి. యూరియా 80శాతం మేర సొసైటీల నుంచే రైతులకు అందుతోంది. ఏటా 5వేల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం కోఆపరేటివ్ అధికారులనే పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించటంతో రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సకాలంలో ఎరువులు అందటం లేదని, ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో 131 సంఘాలు..
కొత్త మండలాల్లో 131 కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని సహకార శాఖ ప్రభుత్వానికి రెండు నెలల క్రితం సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి ఆమోదం లభించిన వెంటనే ఈ సంఘాలు కార్యరూపం దాల్చనున్నాయి. అయితే, వీటి విస్తరణలో తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. కొన్నిచోట్ల రెండు గ్రామాలకు ఒక సంఘం ఉంటే మరికొన్నిచోట్ల 30 గ్రామాలకు కలిపి ఒకటే సంఘం ఉంది. సభ్యత్వ పరంగా ఒక సంఘంలో 500 మంది ఉంటే, మరికొన్నింటిలో 2,500 మంది రైతులు ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 81 మండలాల్లో ఒక్క సహకార సంఘం లేదు. ఈ వ్యత్యాసాలను గమనించిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి 31 జిల్లాల నుంచి వచ్చిన 215 ప్రతిపాదనలను పరిశీలించి 131 మండలాలకు సహకార శాఖ జాబితా సిద్ధం






