- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PAC Meeting: స్థానిక ఎన్నికలపై పార్టీ వ్యూహాలు! గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం
కాంగ్రెస్ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభం అయింది. ఇవాళ గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభం అయింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం ప్రారంభం అయింది. మంగళవారం (Gandhi Bhavan) ఉదయం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభం అయింది. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), కార్యదర్శి విశ్వనాథన్, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీ కృష్ణ, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జరగబోయే (local elections) స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది.
అదేవిధంగా పీఏసీ మీటింగ్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. రాష్ట్రంలో అద్భుతమైన ప్రజాపాలన సాగుతోందన్నారు. ఏఐసీసీ మనకు ఇస్తున్న సూచనల మేరకు పని చేస్తున్నామని తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన జైబాపు జై భీమ్ సంవిధాన్, సంస్థాగత నిర్మాణం తదితర కార్యక్రమాలను రాష్ట్రంలో చాలా బాగా అవుతున్నాయని ఏఐసీసీ నేతలు అభినందించారని తెలిపారు. మనం కూడా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని, అందుకు అందరూ పని చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కీలక సూచనలు ఇచ్చారు.
అదేవిధంగా గాంధీ భవన్‌లో ఉదయం క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జిల్లాలో కొంత మంది కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించేందుకు చర్చలు జరిగినట్లు తెలిసింది. కాగా, ఇటీవల వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ.. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరిన విషయం అందరికీ తెలిసిందే.






