- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ టూరిజం ఎండీగా బాధ్యతలు స్వీకరించిన పి.గౌతమి
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఎండీగా పి.గౌతమి అదనపు బాధ్యతలు చేపట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL) జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఖులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్‌గా సేవలు అందిస్తున్న పి.గౌతమికి టూరిజం ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా పి.గౌతమి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సంస్థ ఎండీగా ఉన్న వల్లూరు క్రాంతి, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు సెలవుపై వెళ్లడంతో, ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె సంస్థలోని అన్ని విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పర్యాటక మౌలిక వసతుల బలోపేతం, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించడం, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు. సమన్వయంతో కూడిన కృషి, నూతన ఆవిష్కరణలు, సమర్థవంతమైన సేవల ద్వారానే సంస్థ లక్ష్యాలను చేరుకోగలమని ఈ సందర్భంగా గౌతమి పేర్కొన్నారు. సెలవు ముగిసిన అనంతరం వల్లూరు క్రాంతి తిరిగి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు.






