ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత ఇంటిని నిర్మించుకుంటున్న సుమారు 23 వేల మంది లబ్ధిదారులకు రూ.262.51 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత ఇంటిని నిర్మించుకుంటున్న సుమారు 23 వేల మంది లబ్ధిదారులకు రూ.262.51 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు. ఈ మొత్తాన్ని ఆధార్ నెంబర్ ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరు గా జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వారం చేసిన చెల్లింపుల్లో, బేస్‌మెంట్ స్థాయి నిర్మాణ పనులను పూర్తిచేసిన లబ్ధిదారులు 2,763 మంది, గోడలు, శ్లాబ్ కట్టడాల స్థాయి దాటిన వారు 20,186 ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పతవరకు రూ.4,351 కోట్లకు పైగా నిధులను లబ్ధిదారులకు విడుదల చేశామని, బిల్లులను విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

మార్చి నాటికి లక్ష ఇళ్లు పూర్తి..

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది మార్చి నాటికల్లా లక్ష ఇండ్లను పూర్తి చేయడంతోపాటు, తదుపరి దశను ప్రారంభించడానికి ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతున్నదని ఎండీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులు జోరుగా కొనసాగుతున్నాయని, మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండ్లు కట్టుకుంటున్న వారందరికీ బిల్లులు సకాలంలో విడుదల అవుతున్నాయని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా, ఆన్‌లైన్‌లోనూ, క్షేత్ర స్థాయిలోనూ నిశిత పరిశీలన అనంతరమే బిల్లులు మంజూరవుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతవరకు 2.50 లక్షల ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో సుమారు 1.25 లక్షల ఇండ్లు గోడలు, శ్లాబ్‌లు త్వరలోనే పూర్తి కానున్నాయని తెలిపారు. మరో 75 వేల ఇండ్ల పనులు బేస్ మెంట్ స్థాయిని దాటిపోయాయని వెల్లడించారు. ఇండ్ల నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కలెక్టర్లు తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారని, నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

Next Story