చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

by Gantepaka Srikanth |

చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత సర్పంచ్ ఎన్నికల(Telangana Sarpanch Elections) ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌ సర్పంచ్ అభ్యర్థులు 1567 మంది, BRS సర్పంచ్ అభ్యర్థులు 755, BJP సర్పంచి అభ్యర్ధులు 135, ఇతరులు 350 మంది ఇప్పటి వరకు గెలుపొందారు. ఇంకా పలుచోట్ల రీకౌంటింగ్‌ వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్ బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.

Next Story