ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి

by Ajay Maddhiboyina |

ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత ఇస్తూ కార్పోరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ జేఏసీ తరపున సీఎం కు లేఖ రాశారు.

ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత ఇస్తూ కార్పోరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ జేఏసీ తరపున సీఎం కు లేఖ రాశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని అవుట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని తమకు అదే విధంగా కల్పించాలని పేర్కోన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యల తీసుకోవాలని కోరారు.

Next Story