జూబ్లీహిల్స్‌లో మా విజయం ఖరారైంది.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-26 10:58:57  IST  )

రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీని ప్రజలకు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు.

జూబ్లీహిల్స్‌లో మా విజయం ఖరారైంది.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీని ప్రజలకు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. ఇవాళ ఆయన జూబీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో తమ అభ్యర్థి నవీన్ యాదవ్‌ (Naveen Yadav)కు మద్దతుగా లోకల్ కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ దోపిడీని భరించలేకపోయారని కమామెంట్ చేశారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీకి అధికారన్ని కట్టబెట్టారని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో కూడా తమ అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు. ఇటీవల జరిగిన కంటోన్మెంట్‌ (Cantonment)లో బై ఎలక్షన్‌లో సెంటిమెంట్‌ పని చేయలేదని గుర్తు చేశారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ (KCR) మా అభ్యర్థి గురించి మాట్లాడాడంటే మా విజయం అప్పుడే ఖాయమైదని అన్నారు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అయితే పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయో బీఆర్ఎస్ నేతలు బయట పెట్టాలని సవాలు విసిరారు. జూబ్లీహిల్స్ అంటే క్లాస్ పీపుల్ అని అందరూ అనుకుంటారని.. ఇందంతా మాస్ ఏరియా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

READ MORE ....

కంటోన్మెంట్‌లో సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు.. జూబ్లీహిల్స్‌లో కూడా కాదు: మంత్రి కోమటిరెడ్డి

Next Story