మా అభ్యర్థిని ఓ సీఐ తుపాకీ‌తో బెదిరించాడు.. కూనంనేని సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-18 10:46:19  IST  )

మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నామినేషన్ విత్‌డ్రా సమయంలో ఓ సీఐ తుపాకీతో బెదిరించారని సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు.

మా అభ్యర్థిని ఓ సీఐ తుపాకీ‌తో బెదిరించాడు..  కూనంనేని సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల మధ్య పొలిటిలకల్ హీట్ నెలకొంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అధికార పక్షం, పోలీసు తీరుపై మండిపడ్డారు. ఎన్నికల నామినేషన్ల విత్‌డ్రా సమయంలో తమ పార్టీ అభ్యర్థిని ఓ సీఐ (CI) తుపాకీతో బెదిరించారని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవకుండా ఉండేందుకు పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ కుట్రలు చేసిందని కూనంనేని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవాలనుకుంటే ప్రజాస్వామికంగా గెలవాలి కానీ, పోలీసుల తుపాకులతో బెదిరించి అభ్యర్థులను ఉపసంహరింపజేయడం ఏ రకమైన రాజకీయని ప్రశ్నించారు. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్‌ను అభ్యర్థికి గురిపెట్టి నామినేషన్ (Nomination) విత్ డ్రా చేసుకోమనడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు పొత్తు విషయంలో కాంగ్రెస్ (Congress) పార్టీ మోసం చేసిందని, అభ్యర్థులను గన్ పెట్టి బెదిరించినా కూడా, ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా తాము కాంగ్రెస్‌తో ఒప్పందానికి రావాల్సి వచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఒప్పందం కుదిరినట్లు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

Next Story