OU: రేపటి నుంచి ఓయూ హాస్టళ్లు బంద్.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-30 05:34:30  IST  )

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విద్యార్థులకు బిగ్ అలర్ట్.

OU: రేపటి నుంచి ఓయూ హాస్టళ్లు బంద్.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి (మే1 నుంచి) మే31 వరకు వేసవి సెలవుల (Summer Holidays) నేపథ్యంలో క్యాంపస్ పరిధిలోని హాస్టళ్లు (Hostels), మెస్‌ (Mess)లను పూర్తిగా మూసివేస్తున్నట్లుగా చీఫ్ వార్డెన్ (Chief Warden) ఇవాళ సర్క్యూలర్ (Circular) జారీ చేశారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, తాగునీరు, విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, జూన్ 1న హాస్టళ్లు, మెస్‌లను రీ ఓపెన్ చేస్తామని తెలిపారు. అయితే, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇలా వేసవి సెలవులు ప్రకటించడం హస్టళ్లు, మెస్ మూసివేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story