విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షలు అన్నీ వాయిదా

by Ajay Maddhiboyina |

వినాయ‌క నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో రేపు ఓయూ ప‌రిధిలో జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. పీజీ కోర్సుల మూడో సెమిస్ట‌ర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్ మెంట్ ప‌రీక్ష‌ల‌తో పాటు బీఈడీ 2, 3వ ప‌రీక్ష‌ల‌ను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షలు అన్నీ వాయిదా
X

దిశ‌, వెబ్ డెస్క్: వినాయ‌క నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో రేపు ఓయూ ప‌రిధిలో జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. పీజీ కోర్సుల మూడో సెమిస్ట‌ర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్ మెంట్ ప‌రీక్ష‌ల‌తో పాటు బీఈడీ 2, 3వ ప‌రీక్ష‌ల‌ను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. అంతే కాకుండా గ్రేట‌ర్ ప‌రిధిలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల‌కు కూడా సెల‌వు ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్, మేడ్చ‌ల్, రంగారెడ్డి జిల్లాల్లో సెల‌వు వ‌ర్తించ‌నుంది. రేపు సెల‌వు ఇవ్వ‌డంతో అక్టోబ‌ర్ 2వ తేదీ శ‌నివారం రోజున ప‌ని దినంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌రోవైపు సాలార్ జంగ్ మ్యూజియంకు సైతం సెల‌వు ఉంటుంద‌ని నిర్వాహ‌కులు చెప్పారు.

Next Story