- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయూలో భారీ కుంభకోణం : కాగ్ నివేదికలో సంచలన నిజాలు
ఓయూలో భారీ కుంభకోణం జరిగినట్లు కాగ్ నివేదిక చెబుతోంది. అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు చాలానే ఉన్నట్లు పేర్కొంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఉస్మానియా యూనివర్సిటీలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు జరిగినట్లు కాగ్ నివేదికలో వెల్లడైంది. 2017-22 మధ్య కాలంలో నిర్దేశించిన పరిమితికి మించి ఈ నియామకాలు చేపట్టారు. యూజీసీ నిబంధనల ప్రకారం, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని బట్టి కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించాల్సి ఉంటుంది. మొత్తం మంజూరైన అధ్యాపక పోస్టుల్లో కాంట్రాక్ట్ సిబ్బంది సంఖ్య 10 శాతానికి మించకూడదు. రెగ్యులర్, కాంట్రాక్ట్ సిబ్బంది కలిపి మొత్తం మంజూరైన పోస్టుల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆడిట్ నివేదిక ప్రకారం, 2017-22 మధ్య కాలంలో వర్సిటీలో మొత్తం 1,267 బోధనా పోస్టులు మంజూరయ్యాయి. దీని ప్రకారం గరిష్ఠంగా 127 మందిని మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉండగా, యూనివర్సిటీ అంతకంటే ఎక్కువ మందిని నియమించింది.
నిబంధనల ఉల్లంఘన
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హతలు లేని 82 మందిని అధ్యాపకులుగా నియమించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాల్లో కోఠి మహిళా కాలేజ్‌లో 26 మంది, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఓయూసీఈ)లో 23 మంది, సికింద్రాబాద్ ఓయూ పీజీ కాలేజీలో 18 మంది, మిర్జాపూర్ పీజీ కాలేజీ 8 మంది ఉన్నారు.
బీఈ, బీటెక్‌తోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లు
యూజీసీ నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయాలంటే పీజీలో 55 శాతం మార్కులతో పాటు నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ ఉండాలి. కానీ, ఈ నియామకాల్లో కనీసం పీజీ కూడా లేని వారు ఉన్నట్లు కాగ్ గుర్తించింది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఒకరు బీఈ అర్హతతో, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఒకరు కేవలం బీటెక్ అర్హతతో అధ్యాపకులుగా కొనసాగుతుండటం గమనార్హం. మరికొందరు 2022-24 మధ్య కాలంలో పీహెచ్‌డీలు పూర్తి చేసినప్పటికీ, అంతకుముందు వారు ఏ ప్రాతిపదికన నియమించబడ్డారనేది ప్రశ్నార్థకంగా మారింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో కాగ్‌కు బదులిస్తూ ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీల కింద నియమితులైన వారు రెండేళ్లలోపు నెట్ లేదా సెట్ పాస్ కావాలనే నిబంధనతో నియామకం జరిగిందని తెలిపింది. అర్హత సాధించని వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు నిలిపివేస్తామని పేర్కొంది. అలాగే, మరికొందరు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కాలేజీ స్థాయి కమిటీల ద్వారా నియమితులయ్యారని వెల్లడించింది. మొత్తం టీచింగ్ స్టాఫ్‌లో దాదాపు 10 శాతం మంది అర్హత లేని వారే ఉండటం గమనార్హం.
అదనపు నియామకాలు ఇలా..






