HYD: కన్నీరు పెట్టిన ఉస్మానియా వైద్య విద్యార్థులు

by Gantepaka Srikanth |

ఉస్మానియా వైద్య కళాశాల(Osmania Medical College) ఆడిటోరియంలో డాక్టర్ దుర్గా కిరణ్ ఆధ్వర్యంలో వైద్య గర్జన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

HYD: కన్నీరు పెట్టిన ఉస్మానియా వైద్య విద్యార్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా వైద్య కళాశాల(Osmania Medical College) ఆడిటోరియంలో డాక్టర్ దుర్గా కిరణ్ ఆధ్వర్యంలో వైద్య గర్జన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బొంగు రమేష్, ప్రత్యేక అతిథిగా టీపీహెచ్డీఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్ధన్ హాజరయ్యారు. 2010లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగిన వైద్య గర్జన సభ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఆరోజు జరిగిన పరిస్థితులు, ఉద్విగ్న క్షణాలను నెమరు వేసుకుని నాయకులు భావోద్వేగానికి లోనయ్యారు. డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. వైద్య గర్జన గురించి చరిత్రలో లేకుండా చేశారని, చరిత్రని గుర్తుకు చేసుకోవడానికి, ఆ స్ఫూర్తిని ముందుకు కొనసాగించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. డాక్టర్ బొంగు రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో వైద్యుల పాత్ర వెళలేనిది అని తమ విధులకు ఆటంకం కలిగించుకుండానే రాష్ట్ర సాధన పోరాటాలను ఉధృతం చేశారని రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు, మరియు పూర్వ ఉద్యమ నాయకులు, కళాశాల సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.

Next Story