- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Miss World Contestants : మిస్ వరల్డ్ బ్యూటీస్ కి ఘనస్వాగతం పలికిన ఓరుగల్లు
మిస్ వరల్డ్ అందగత్తెల(Miss World Contestants)కు ఓరుగల్లు నగరం ఘన స్వాగతం పలికింది.

దిశ, వెబ్ డెస్క్ : మిస్ వరల్డ్ అందగత్తెల(Miss World Contestants)కు ఓరుగల్లు నగరం ఘన స్వాగతం పలికింది. మిస్ వరల్డ్ పోటీదారులైన 57 మంది ఇంటర్నేషనల్ బ్యూటీస్ కొద్దిసేపటి క్రితమే వరంగల్(Warangal) నగరాన్ని చేరుకున్నారు. వారు కాకతీయ వారసత్వ సంపదను సందర్శించేందుకు హైదరాబాద్ నుంచి హరిత కాకతీయ హోటల్‌కు చేరుకున్న సుందరీమణులకు బతుకమ్మ, తదితర సాంస్కృతిక కార్యక్రమంతో కళాకారులు గొప్ప స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రెండు బృందాలుగా వరంగల్ లోని కాకతీయ కట్టడాలను సందర్శించనున్నారు. 22 మంది గల ఒక బృందం హన్మకొండలోని వేయి స్తంభాల గుడి(Thousand Pillars Temple), వరంగల్ కోట(Warangal Fort)ను సందర్శించనుండగా.. 35 మందిగల మరో బృందం.. ములుగు జిల్లా పాలంపేటలోని యునెస్కో(UNESCO) ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయాన్ని(Ramappa Temple) సందర్శిస్తారు.
రామప్ప ఆలయంలో పేరిణి నృత్య ప్రదర్శన(Perini Dance), లైటింగ్ షో నిర్వహించనుండగా.. ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. పాండురంగ రావు ఆలయ శిల్పకళ, చరిత్రను వివరిస్తారు. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటనను హన్మకొండ కలెక్టర్ ప్రవీణ్య, వరంగల్ కలెక్టర్ సత్య శారద, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క(Minister Seethakka) సమన్వయం చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ పర్యటన కీలకమైందని తెలిపారు.






