డీజీపీ కార్యాలయంలో ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు ప్రత్యేక ఓరియంటేషన్

by Ramesh Naini |

రాష్ట్రానికి కేటాయించిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగింది.

డీజీపీ కార్యాలయంలో ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు ప్రత్యేక ఓరియంటేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి కేటాయించిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. మందారే సోహం సునీల్ (2023 బ్యాచ్) రాహుల్ కాంత్ (2023), అయేషా ఫాతిమా (2023 బ్యాచ్), మనీషా నెహ్రా (2024 బ్యాచ్ )లు డీజీపీ కార్యాలయంలో వివిధ విభాగాలను సందర్శించి అక్కడ పనితీరును తెలుసుకున్నారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, డీజీ స్వాతిలక్రా, అడిషనల్ డీజీపీలు వి.వి.శ్రీనివాసరావు, చారుసిన్హాలను ఏఐజీ రమణ కుమార్, ఐజీ (పీఅండ్ఎల్) ఎం .రమేష్, కలుసుకున్నారు. శాంతి భద్రతలు, ఆర్గనైజేషన్ సెటప్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్, ఆర్గనైజేషన్, మహిళా భద్రతా విభాగం చర్యల గురించి తెలుసుకున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఐదు వారాల పాటు శిక్షణ పూర్తయిన అనంతరం వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జిల్లా స్థాయి శిక్షణ పొందనున్నారు. మహారాష్ట్రకు చెందిన మందార సోహం సునీల్ కరీంనగర్ కమిషనరేట్ లోనూ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కాంత్ ఆదిలాబాద్ జిల్లాలోనూ, మధ్యప్రదేశ్ కు చెందిన ఆయాస ఫాతిమా సిద్దిపేట కమిషనరేట్ లోనూ, రాజస్థాన్ కు చెందిన మనీష్ నెహ్రా ములుగు జిల్లాలో శిక్షణ పొందనున్నారు.

అడిషనల్ డీజీపీని కలిసిన మహిళా షూటర్ ఈషా సింగ్

మహిళా షూటర్ ఈషా సింగ్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ను డీజీపీ కార్యాలయంలో మంగళవారం కలిశారు. ఇటీవల ఈజిప్టు దేశ రాజధాని కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ పోటీలలో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడంతో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మిక్స్డ్, బృందం పోటీలలో మరో రెండు సిల్వర్ మెడల్స్ ని గెలుచుకున్నారు. దాదాపు 70 దేశాల నుంచి 700 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో 3 బహుమతులు గెలుచుకున్న ఈషా సింగ్ ని అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ అభినందించారు.

Next Story