అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఆ భవనాలు కూల్చివేత

by Gantepaka Srikanth |

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India Flight Accident) తర్వాత పౌర విమానయాన శాఖ(Civil Aviation Department) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఆ భవనాలు కూల్చివేత
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India Flight Accident) తర్వాత పౌర విమానయాన శాఖ(Civil Aviation Department) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలపై దృష్టి సారించింది. ఎయిరోడ్రోమ్‌ జోన్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల ఎత్తు తగ్గించేందుకు లేదా కూల్చి వేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ (డిమోలిషన్ ఆఫ్ ఆబ్‌స్ట్రక్షన్) రూల్స్ 2025 పేరిట ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిసర భవనాలపై అధికారులు దృష్టి సారించారు. బేగంపేట పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూల్చివేతకు ఆదేశించారు. ఈ ఆదేశాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా భవనాలు కూల్చివేసి.. స్థానికంగా ఖాళీ చేయిస్తే.. తాము ఎక్కడి వెళ్లాలి.. చేయాలి అని అధికారులను నిలదీస్తున్నట్లు సమాచారం.

Next Story