- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఎస్ఈ 12వ తరగతి పేపర్ల రీ వాల్యుయేషన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన
సీబీఎస్‌ఈ 12వ తరగతి మూల్యాంకనంలో తప్పులు దొర్లాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. రీ-వాల్యుయేషన్‌కు ఆదేశించామన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో తలెత్తిన సాంకేతిక లోపాలు, వ్యత్యాసాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన చేశారు. మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్లు అంగీకరించిన ఆయన దీనికి పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు నష్టం జరగకుండా సీబీఎస్‍ఈ 12వ తరగతి పేపర్ల రీ వాల్యువేషన్ కు ఆదేశించామని ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యార్థుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
విద్యార్థులకు మేలు చేయడానికి ఓఎస్ఎమ్:
ఈ ఏడాది సీబీఎస్‌ఈ దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన సరికొత్త ఓఎస్ఎమ్ (OSM - On-Screen Marking) డిజిటల్ మూల్యాంకన విధానాన్ని మంత్రి సమర్థించారు. ఇది ఒక ప్రగతిశీల (Progressive) సాధనమని, వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడానికి మరియు విద్యార్థులకు మేలు చేయడానికే దీనిని రూపొందించామని వివరించారు. అయితే ఈ మూల్యాంకనంలో తొప్పులపై దర్యాప్తు చేపట్టామని దీనికి కారకులైన వారిని వదిలిపెట్టబోమన్నారు.






