జాగ్రత్త.. రెండు గంటల్లో వర్షం.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

జాగ్రత్త.. రెండు గంటల్లో వర్షం.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Weather Department) వెల్లడించింది. ఈ మేరకు ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, ఖమ్మం, ఆసిఫాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. ఆయా జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే హైదరాబాద్‌లోనూ రెండు గంటల్లో వర్షం పడే సూచనలున్నాయని తెలిపింది. కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అడపా దడపా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Next Story