- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
weather Report: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.

X
దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కాగా నేడు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ పేర్కొంది. అలానే రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది
Next Story






