నాపై ప్రతిపక్షాల ఆరోపణలు పని చేయవు.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

by Kema Shiva Kumar |

తనపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఏమాత్రం పని చేయబోవని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) అన్నారు.

నాపై ప్రతిపక్షాల ఆరోపణలు పని చేయవు.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: తనపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఏమాత్రం పని చేయబోవని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) అన్నారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ నియోజవర్గ పరిధిలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, భారీ మెజారిటీతో గెలవబోతున్నామని అన్నారు. జనాలకు అన్ని విషయాలు తెలుసని.. ఎవరూ మోసపోయే పరిస్థితిలో లేరని తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నామని, ఓటు ఎలా వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం యాప్ ద్వారా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈసారి పోలింగ్ 60 శాతం దాటే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో 4 లక్షల ఓటర్లు ఉన్నారని.. అందులో లక్ష మంది ఓటర్లు ఐడెంటిఫై అవ్వట్లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారని.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని నవీన్ యాదవ్ అన్నారు.

Next Story