రేవంత్ వ్యాఖ్యలపై విపక్షాలు గరం.. మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-06 07:34:51  IST  )

రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

రేవంత్ వ్యాఖ్యలపై విపక్షాలు గరం.. మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పందించారు. ఇవాళ ఖమ్మం (Khammam)లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. తాము అధికారంలోకి రాక ముందు రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉందని అనుకున్నామని.. తీరా చూస్తే రూ.8 లక్షల కోట్లు ఉందన్నారు. అంత అప్పు ఉన్నా.. 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలను ఆపలేదని అన్నారు.

ప్రతి నెలా అప్పులకే దాదాపు రూ.6,500 కోట్లు మేర చెల్లిస్తున్నామని కామెంట్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. షో పాలిటిక్స్ చేయడం ఇందిరమ్మ ప్రభుత్వానికి తెలియదని.. అప్పుల విషయంలో నిజాలను ప్రజలకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలని పేర్కొన్నారు. అప్పులపై వాస్తవాలను అసెంబ్లీ (Assembly)లో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క లెక్కలతో సహా చెబితే.. గుండాగిరీ చేస్తూ తప్పును ఒప్పు చేయాలని బీఆర్ఎస్ (BRS) ప్రయత్నించింది వాస్తవం కాదా అని ప్రశ్నించింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా కాలం గడుపుతున్నారని.. ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మంత్రి పొంగులేటి అన్నారు.

Read More..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్.. సర్కార్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్

Next Story