‘ఏకశిల’.. మళ్లీ కొత్త దందా !

by Batti.Sumithra |

హయత్​నగర్​ మండల పరిధిలోని ప్రైవేట్​, కార్పొరేట్​ విద్యా సంస్థల అక్రమాలు ఏటికేడు మితిమీరిపోతున్నాయి.

‘ఏకశిల’.. మళ్లీ కొత్త దందా !
X

దిశ, వనస్థలిపురం: హయత్​నగర్​ మండల పరిధిలోని ప్రైవేట్​, కార్పొరేట్​ విద్యా సంస్థల అక్రమాలు ఏటికేడు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యా వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నాయి. విద్యా భోదనను ఒక బాధ్యతగా భావించకుండా ధనార్జనే ధ్యేయంగా ‘ఏకశిల గ్రూప్​ ఆఫ్​ స్కూల్​’ యాజమాన్యం రెండేళ్లుగా సామాన్య తల్లిదండ్రులను పేర్ల మార్పిడితో నమ్మించి నిలువు ఫీజు దోపిడీ చేస్తోంది. ప్రియదర్శిని కాలనీలోని ‘సెయింట్​ జోసెఫ్​ స్కూల్’​ పేరుతో పర్మిషన్​ ఉన్న స్కూల్​కు ఇష్టారాజ్యంగా పేర్లు మార్చుతూ.. ఫీజులు పెంచుతూ.. తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తోంది. ఈ అకడమిక్​ ఇయర్ లో ‘ఏకశిల అడ్వాన్స్​డ్​ లెర్నింగ్​ స్కూల్’ అంటూ బోర్డులు మార్చింది. ఈ పేరు తో స్కూల్​కు రాష్ట్ర విద్యాశాఖ నుంచి కనీస అనుమతులు లేకున్నా యథేచ్ఛగా అడ్మిషన్లను ఆకర్షిస్తోంది. ఈ నిజాన్ని దాచిపెట్టి సీబీఎస్​ఈ కరిక్యులమ్‌లో​ బోధన అంటూ.. హంగూ ఆర్భాటాలతో హయత్​నగర్​ అంతటా భారీ ఎత్తున ప్రచారం చేస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు.

ఎంఈవో, డీఈవో పాత్ర పై అనుమానాలు ?

ఈ వ్యవహారం పై రెండేళ్లుగా ఎంఈవో, డీఈవో ఆఫీసులతో పాటు కలెక్టర్ ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీసీ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఎంఈవో శ్రీనివాస్​, ఇటీవల బదిలీ అయిన డీఈవో సుశీందర్​రావు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ నిబంధనలను గాలికొదిలేశారనే విమర్శిస్తున్నారు. యాజమాన్యం, అధికారులు విద్యాసంస్థల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ఒక పేరుతో అనుమతులు పొంది మరో పేరుతో కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాల అనుమతులు, గుర్తింపు, బోధనకు సంబంధించిన అన్ని వివరాలను ప్రజలకు వెల్లడించి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పర్మిషన్​ లేకుండానే అడ్మిషన్లు..

హయత్​నగర్​లో ‘ఏకశిల గ్రూప్​ ఆఫ్​ స్కూల్​’ యాజమాన్యం అక్రమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2024–25 ఎడ్యుకేషన్​ అకడమిక్​ ఇయర్​లో.. ప్రియదర్శిని కాలనీలోని సెయింట్​ జోసెఫ్​ హై స్కూల్‌ను ‘ఏకశిల’ యాజమాన్యం కొనుగోలు చేసింది. నిర్వాహకులు ఆ అకడమిక్​ మధ్యలో నుంచే ‘ఏక శిలాస్​ సెయింట్​ జోసెఫ్ హైస్కూల్​’ అంటూ పేరు మార్చేసి పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులకు పాల్పడి గందరగోళానికి గురి చేశారు. 2025–‌‌26 అకడమిక్​ ఇయ ర్​ ప్రారంభంలో విద్యాశాఖ నుంచి ఎలాంటి పర్మిషన్​ లేకుండా, కనీసం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం లేకుండా ‘‘ఏకశిలాస్ సెయింట్​ జోసెఫ్స్​ హైస్కూల్’​గా మార్చి బుక్స్​, యూ నిఫామ్​, అంతా మార్చి తల్లిదండ్రుల వద్ద భారీగానే ఫీజు దోపిడీకి పాల్పడ్డారు.

ఏకశిలాస్​ సెయింట్​ జోసెఫ్​ ​హైస్కూల్ పేరుతో పాంప్లెంట్లు వేసి ‘హైదరాబాద్​లో మొదటి ఏకశిల స్కూల్​’ అంటూ.. మోసపూరిత ప్రచారం చేశారు. స్టేట్​ పర్మిషన్ ​ఉన్న స్కూల్‌లో సీబీఎస్ఈ కరిక్యులమ్ .. బోధిస్తామంటూ.. ఒక్కసారిగా ఫీజు లు డబుల్​ చేశారు. దీంతో అవాక్కయిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు నిలదీయగా.. మళ్లీ ‘సెయింట్​ జోసెఫ్స్​ హైస్కూల్​ అండర్​ ఏకశిల మేనేజ్మెంట్​’ అంటూ బోర్డులు మార్చారు. ఈ విషయంపై ఎంఈవో, డీఈవోకు కు ఫిర్యాదులు వెళ్లడంతో ఎంఈవో శ్రీనివాస్ హడావిడిగా తనిఖీలు చేసి బోర్డులపై వైట్​పేపర్లు అంటించారు. అనంతరం యథావిధిగా కొనసాగినా ఏం జరిగిందో ఏమో కానీ.. ఇక ప్రస్తుతం ఈ అకడమిక్​ ఇయర్​లో (2026–27) కు విద్యాశాఖ నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా.. ‘సెయింట్​ జోసె ఫ్​ హైస్కూల్ అండర్​ ఏకశిల మేనేజ్​మెంట్​’ బోర్డులను తొలగించి ‘ఏకశిల అడ్వాన్స్​డ్​ లెర్నింగ్​ స్కూల్​‘ అం టూ పేరు మార్చి బోర్డులను ఏర్పాటు చేశారు.

‘ఏకశిల’కు పర్మిషన్​ లేదు.. ​శ్రీనివాస్​, మండల విద్యాధికారి, హయత్​నగర్

‘ఏకశిల అడ్వా న్స్​డ్​ లెర్నింగ్​ స్కూల్’​ పేరు తో మండలం లో ఎలాంటి పర్మిషన్​ లేదు. ప్రియదర్శిని కాలనీలో ‘సెయింట్​ జోసెఫ్​ స్కూల్’​ పేరు మార్పిడి మా దృష్టికి కూడా వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అలా పేర్లు మార్చొద్దని చెప్పాం. యాజమాన్యం వారు ‘ పర్మి షన్​ చేసుకున్నాం’ అని చెప్పారు. పర్మిషన్​ వచ్చేవరకు ఎలాంటి బోర్డులు మార్చొద్దని చెప్పాం. అయినా అలాగే కొనసాగిస్తే చర్యలు తీసుకుంటాం.

Next Story