వెల్‌లోకి దూసుకొచ్చిన విపక్ష సభ్యులు.. SIRపై మరోసారి చర్చకు డిమాండ్

by Kema Shiva Kumar |

పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Winter Session of Parliament) సందర్భంగా రెండో ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి.

వెల్‌లోకి దూసుకొచ్చిన విపక్ష సభ్యులు.. SIRపై మరోసారి చర్చకు డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Winter Session of Parliament) సందర్భంగా రెండో ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కొనసాగుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పునరీక్షణ (SIR) ప్రక్రియపై తక్షణమే చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇవ్వగా స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ఎస్ఐఆర్ (SIR) అంశంపై తక్షణమే చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతరం ప్రతిపక్ష సభ్యులు ప్లాకార్డులను చేతబట్టుకుని ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్ దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ తీవ్రంగా మందలించడంతో వారంతా SIRకి వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రతిపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా SIR పేరుతో లక్షలాది మంది అర్హులైన పౌరుల, ముఖ్యంగా బలహీన వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి వంటి ముఖ్యమైన ప్రజా సమస్యలపై కూడా చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

మరో వైపు విపక్షాల ఆందోళనపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో మండిపడింది. SIR అనేది ఎన్నికల సంఘానికి (ECI) సంబంధించిన అంశమని, దీనిపై పార్లమెంట్‌లో చర్చించేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది. గతంలో స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ చర్చకు నిరాకరించారు. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు తమ నినాదాలను కొనసాగించడంతో సభాపతులు శాంతించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితి సద్దుమణగపోవడంతో స్పీకర్ ఓం బిర్లాను సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

Next Story