- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణాదికి నష్టం జరగుకుండా 50 శాతం పెంచుతామన్న విపక్షాలు వినలేదు : ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఇప్పటి వరకు 10 సార్లు ప్రవేశపెడితే ముందుకు పోకుండా కాంగ్రెస్ కుట్రలు చేసిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఇప్పటి వరకు 10 సార్లు ప్రవేశపెడితే ముందుకు పోకుండా కాంగ్రెస్ కుట్రలు చేసిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రధానిగా మోడీ అధికారం చేపట్టిన తర్వాత మహిళా బిల్లు కచ్చితంగా చేయాలని కంకణం కట్టుకుని, దేశంలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఉండాలని ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ మిత్ర పక్షాలతో పాటు ముస్లిం మైనార్టీ నేతలు కూడా వ్యతిరేకించారు. బిల్లు పెట్టక ముందు మోడీ అందరితో చర్చించారని పురుషులకి నష్టం జరగకుండా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అందుకే డీలిమిటేషన్ లో మహిళలకు ఎక్కువగా ఇవ్వాలని అనుకున్నారు, 2023లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి మోడీ అందరినీ ఒప్పించాడు. అప్పుడు మహిళా బిల్లుకి డీలిమిటేషన్ కు కాంగ్రెస్, డీఎంకే ఒప్పుకున్నారు. ఉమెన్ బిల్లు త్వరగా అమలు చేయాలని డిమాండ్ కూడా చేశారు. సెన్సెస్ మొదలైంది కానీ కాస్ట్ పరంగా సెన్సెస్ కావాలని డిమాండ్ చేసి సెన్సెస్ ను నిర్లక్ష్యం చేశారు’ అని తెలిపారు.
కుల గణన పూర్తి కావాలంటే 2037 వరకు అవుతుందని ఆలస్యం జరుగుతుందని డీలిమిటేషన్ తో పాటు మహిళ రిజర్వేషన్ పెట్టారని అన్నారు. దీనిపై ఏడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.. దక్షిణ భారత దేశానికి నష్టం జరుగుతుందని అంటున్నారు. అందుకు ప్రతి రాష్ట్రంలో ఉన్న వాటిలో 50 శాతం పెంచుతామని అమిత్ షా స్పష్టం చేసిన విపక్షాలు వినలేదని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీలో జరిగిన డీలిమిటేషన్‌లో మానిప్లేటింగ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. హిందూ కార్పొరేటర్లు ఉన్న చోట 50 వేల ఓట్లుతో ఒక డివిజన్ చేస్తే ముస్లిం కార్పొరేటర్ ఉన్న వద్ద 30 వేలకు డివిజన్ ఎందుకు చేశారని నిలదీశారు. అధికార పార్టీ తప్పులను మాపై ఆపాధించే ప్రయత్నం చేస్తున్నారు. వారి పాలనలో డీలిమిటేషన్ చేసినప్పుడు 7 సీట్లు పెంచితే దక్షిణ భారత దేశంలో ఒక్క సీటు పెంచారు. రెండోసారి డీలిమిటేషన్ లో 27 సీట్లు పెంచి దక్షిణ భారతదేశంలో 2 సీట్లు పెంచారు.. దక్షిణ భారత దేశానికి ఎవరు నష్టం చేశారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు.






