- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలిటెక్నిక్ తో తొందరగా స్థిరపడే అవకాశం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ చిన్న ఉద్యోగానికైనా తీవ్రమైన పోటీ ఉంటుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ చిన్న ఉద్యోగానికైనా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఏం చదివామని కాకుండా ఎంత త్వరగా జీవితంలో స్థిరపడ్డామన్నదే లక్ష్యంగా విద్యార్థులు ఆలోచిస్తున్నారు. డీగ్రి, పీజీ, ఎంటెక్, ఎంబీఏ సర్టిఫికెట్లు చేతబట్టుుకుని నిరుద్యోగులుగా మారడం కంటే, చిన్న వయసులో డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో విద్యార్థులు పాలిటెక్నిక్ వైపు వెళ్లడానికి ఇవి ప్రధాన కారణాలుగా నిపుణులు అభిప్రాయపడుుతన్నారు.
డిప్లొమా చేసినా ఇంజనీరింగ్ చేయాల్సిందే...
ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులు ఎక్కువ మంది ఇటీవల పాలిటెక్నిక్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ డిగ్రీతో సమానంగా పాలిటెక్నిక్ కోర్సులు ఉంటున్నందున ఉద్యోగానికి ఇదే మంచి పునాది అనే ఆలోచనలో విద్యార్థులు ఉన్నారు. అయితే ఇప్పటికి చాలా మంది యువత, వారి కుటుంబాలు డిప్లొమా కంటే ఇంజనీరింగ్ డిగ్రీని ఉన్నత విద్యగా భావిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేయడం వల్ల సామాజిక గౌరవం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆలోచన విద్యార్థుల్లో ఉంది. పాలిటెక్నిక్ లో ఎంచుకున్న వివిధ విభాగాల ఆధారంగా విద్యార్థులకు తొందరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా నీటిపారుదల, ఇంజనీరింగ్, రోడ్లు, భవనాల శాఖ, టీజీఆర్టీసీ, జెన్ కో, విద్యుత్ శాఖ తదితర ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, కార్పోరేట్ సంస్థలు, పరిశ్రమల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి పరిశ్రమల్లో టెక్నీషియన్, సూపర్‌వైజర్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నప్పటికి, ఈ అవకాశాల గురించి యువతకు తగినంత సమాచారం అందడం లేదు. డిప్లొమా పూర్తి చేసిన వారికి ప్రారంభంలో లభించే జీతాలు డిగ్రీ చేసిన వాళ్లతో పొలిస్తే తక్కువగా ఉంటాయి. ఇది వారిని ఉద్యోగాల వైపు మొగ్గకుండా చేస్తుంది. పాలిటెక్నిక్ చేసిన వారికి ఆటో మొబైల్, మ్యానుఫాక్చరింగ్, విద్యుత్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్ ఫ్రాస్టక్షన్ ప్రాజెక్టులు, ఐటీ సెక్టార్ లో పెరుగుతున్న డిమాండ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రంగంలో విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉంటాయి.
అందుబాటులోకి రానున్న రెండు కాలేజీలు:
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 202526 నుంచి మరో రెండు ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, పటాన్ చెరులో ఒక కాలేజీ ప్రారంభించనున్నారు. అయితే పటాన్ చెరులో 2023 జులై లో కాలేజీని ఉన్నత విద్యాశాఖ మంజూరు చేయగా, దానికి శాశ్వత ప్రాతిపదికన 35 భోధనేతర సిబ్బందిని గెస్ట్ లెక్చర్ కింద మంజూరు చేస్తూ 2023 సెప్టెంబర్ లో జీవో జారీ చేసింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చి క్లాసులు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57 ప్రభుత్వ కాలేజీలు ఉండగా, ఆ సంఖ్య వచ్చే ఏడాది 59 కి చేరనుంది. రాష్ట్రంలో ఏటా సుమారుగా 25 నుంచి 30 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు.
ఇటీవలి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్(ఏఐ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్ వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, త్రీడీ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, యానిమేషన్ మల్లీ మీడియా టెక్నాలజీ కోర్సులను కొన్ని సెలక్టెడ్ కాలేజీల్లో అందిస్తున్నారు.
- Tags
- Polytechnic






