‘ఆపరేషన్ కగార్’ ఎఫెక్ట్.. బస్తర్ కమిటీ మావోయిస్టు కీలక నేత మల్లేశ్ సరెండర్

by Kema Shiva Kumar |

రూ. 8 లక్షల రివార్డు ఉన్న సీనియర్ మావోయిస్టు నేత మల్లేష్ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.

‘ఆపరేషన్ కగార్’ ఎఫెక్ట్.. బస్తర్ కమిటీ మావోయిస్టు కీలక నేత మల్లేశ్ సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న బస్తర్ ప్రాంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ బస్తర్ కమిటీకి చెందిన డివిజనల్ కమిటీ మెంబర్ (DVCM) మల్లేశ్ తాజాగా మంగళవారం రాత్రి కాంకేర్ జిల్లాలోని సరిహద్దు భద్రతా దళం (BSF) క్యాంపులో ఎస్పీ నిఖిల్ రఖేచా ఎదుట లొంగిపోయారు. ఆయనపై రూ.8 లక్షల రివార్డు కూడా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలకు ఆకర్షితుడై, హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సరెండర్ అయిన మల్లేశ్ మావోయిస్టు పార్టీలో డివిజనల్ కమిటీ మెంబర్‌గా (DVCM) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బస్తర్ కమిటీలో ఈయన అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. కాంకేర్ జిల్లా ఎస్పీ (Superintendent of Police) కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో తన వద్ద ఉన్న AK-47 రైఫిల్‌2 విడిచిపెట్టి లొంగిపోయారు. పార్టీలో అంతర్గత విభేదాలు, పోలీసుల ‘ఆపరేషన్ కగార్’ ఒత్తిడి కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లొంగిపోయిన మల్లేశ్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసంతో పాటు ఆర్థిక సాయం అందజేస్తామని పోలీసులు ఎస్పీ ప్రకటించారు.

బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో పోలీసులకు ఇది ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. మల్లేష్ లొంగుబాటుతో మరికొంతమంది కేడర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Next Story