- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Chakra-V: ఐదు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు.. 700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు
సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా ఝుళిపించింది. డిజిటల్ అరెస్టు స్కామ్ లు, మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలతో అమాయకులను దోచుకుని ఆ సొమ్మును దాచుకుంటూ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై (మామూలు పౌరుల పేరుతో వారికి తెలియకుండానే సైబర్ క్రిమినల్స్ వాడే ఫేక్ అకౌంట్స్) ఉక్కుపాదం మోపుతోంది. ఈ మ్యూల్ ఖాతాలు (Mule Bank Accounts) ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై ఇవాళ దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో సీబీఐ (CBI Raids) సోదాలు చేపట్టింది. ఆపరేషన్ చక్ర-v (Operation Chakra-v) పేరుతో రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. ఈ సోదాల నేపథ్యంలో మొత్తం 9 మందిని దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.
700 బ్యాంకులు 8.5 లక్షల ఖాతాలు:
పక్కా సమాచారం ఆధారంగా చేపట్టిన ఈ సోదాల్లో దాదాపు 700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాలను సీబీఐ గుర్తించింది. అలాగే పలు కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ డివైజ్ లు, లావాదేవీల వివరాలు, బ్యాంకు ఖాతాల కేవైసీ పత్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరవడంలో సహాయం చేసిన మధ్యవర్తులతో సహా ఈ తరహా స్కామ్ లకు సహాయం చేస్తున్న కీలక వ్యక్తులను గుర్తించారు. సైబర్ నేరాలు అరికట్టే విషయంలో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఇటువంటి నేరాల వెనుక ఉన్న మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిందని సీబీఐ అదికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు.






