రేపు ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాలు విడుదల

by Ajay Maddhiboyina |

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) సెప్టెంబర్ లో నిర్వహించిన ఎస్ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

రేపు ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాలు  విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) సెప్టెంబర్ లో నిర్వహించిన ఎస్ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పరీక్షా ఫలితాలు ఉదయం 11 గంటల నుండి అధికారిక వెబ్‌సైట్ అయిన www.telanganaopenschool.org లో అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రేపటి నుండి వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.

Next Story