హాట్‌కేకుల్లా అమ్ముడైన ఓపెన్ ప్లాట్లు.. హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల ఆదాయం

by Kema Shiva Kumar |

రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలోని 14 హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించగా, గరిష్టంగా చదరపు గజం రూ.51 వేల ధర పలికింది.

హాట్‌కేకుల్లా అమ్ముడైన ఓపెన్ ప్లాట్లు.. హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హౌసింగ్ బోర్డు పరిధిలోని ఓపెన్ ప్లాట్లకు నిర్వహించిన వేలం పాటలో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలోని హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయానికి విశేష స్పందన లభించిందని బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక్కడి 14 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి హౌసింగ్ బోర్డు ఈనెల 2నన నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నిర్వహించిన వేలంలో 49 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఈ భూములకు చదరపు గజానికి రూ.32 వేలను కనీస ధరగా (Base Price) నిర్ణయించగా, వేలంలో గరిష్టంగా చదరపు గజం రూ. 51 వేల ధర పలికింది. 14 ప్లాట్ల విక్రయం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల ఆదాయం సమకూరింది. హౌసింగ్ బోర్డు సౌత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ విక్రయాల్లో అత్యల్పంగా చదరపు గజానికి రూ.36 వేల ధర పలకగా, సగటున రూ.44,285 ధర నమోదైంది.

Next Story