క‌ర్రెగుట్ట‌లో కొన‌సాగుతున్న కూంబింగ్.. కీల‌క నేత‌లు దొరికేనా?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-01 03:24:31  IST  )

తెలంగాణ ఛత్తీస్‌గడ్‌లో సరిహద్దుల్లోని క‌ర్రెగుట్టలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల కూంబింగ్ కొన‌సాగుతూనే ఉంది. ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రం వెనక్కితగ్గడం లేదు.

క‌ర్రెగుట్ట‌లో కొన‌సాగుతున్న కూంబింగ్.. కీల‌క నేత‌లు దొరికేనా?
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ ఛత్తీస్‌గడ్‌లో సరిహద్దుల్లోని క‌ర్రెగుట్టలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల కూంబింగ్ కొన‌సాగుతూనే ఉంది. ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రం వెనక్కితగ్గడం లేదు. ఇప్పటికే భద్రతా బలగాలు రెండు గుట్టలను ఆధీనం చేసుకున్నాయి. గుట్టలపై భాగంలో జాతీయజెండాను సీఆర్‌పీఎఫ్ బలగాలు ఎగరవేశాయి. దాదాపు 20వేల మందికి పైగా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. మంగళవారం భారత ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ తపన్ డేటా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా చూశారు.

ఆపరేషన్ జరుగుతున్న తీరు గురించి సీఆర్పీఎఫ్ అధికారులు ఆయనకు వివరించారు. గుట్టల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపును తపన్ డేటా సందర్శించారు. శాశ్వత బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని బలగాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కర్రెగుట్టల్లోని దోబికొండ, నీలం సరాయి గుట్టలు పూర్తిస్థాయిలో బలగాల ఆధీనంలోకి వచ్చినట్టు సమాచారం.

ఇంకా 10 కీలక గుట్టలు ఉన్నట్టు తెలుస్తోంది. వందల సంఖ్యలో గుహల్లో కూబింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కర్రెగుట్టలు ప్రారంభమై ఇప్పటి వరకు పదిరోజులు అవుతోంది. అయితే కీలక నేతల సమాచారం మాత్రం దొరకలేదు. మావోయిస్టులు దుర్గం గుట్టలకు మకాం మార్చారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు కీలక నేతలు దొరకపోవడం, మరోవైపు మానవహక్కుల నేతలు శాంతి చర్చలకు డిమాండ్ చేయడంతో అసలు వారు దొరుకుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story