అలా చేస్తేనే బీసీ రిజర్వేషన్ల బాధ్యత తీసుకుంటా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-07 04:45:34  IST  )

ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీస్తేనే.. తాను బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

అలా చేస్తేనే బీసీ రిజర్వేషన్ల బాధ్యత తీసుకుంటా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తేనే.. తాను తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. ఇవాళ ఆయన బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసివేస్తే.. తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)తో కలిసి మాట్లాడుతానని తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీలు అసలు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లలో ఎట్లా ముడిపెడతారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story