- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్లార్లలో పార్కింగ్ మాత్రమే.. ఓఆర్‌ఆర్ పరిధిలోని భవనాలలో ఫైర్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ శాఖ అప్రమత్తమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ శాఖ అప్రమత్తమైంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పరిధిలో భవనాల్లో ఫైర్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫెర్ సెఫ్టీ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ మాన్ సింగ్ సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సెల్లార్లను పార్కింగ్‌కు బదులుగా గోదాములుగా వినియోగించడం, సెల్లార్లలో వాచ్‌మన్ కుటుంబాలను నివసింపజేయడం, మెట్ల మార్గాలు, ర్యాంపులను అడ్డుకోవడం, అనుమతికి మించి భారీగా వస్తువులను నిల్వ చేయడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలిపారు.
యాజమాన్యంపై కఠిన చర్యలు
లోపాలు గుర్తించిన భవనాల యాజమాన్యం, మేనేజ్‌మెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీ స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం, ఫైర్ సిస్టమ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, స్ప్రింక్లర్లు వంటి పరికరాలు సక్రమ స్థితిలో ఉండేలా చూడాలని యాజమాన్యాలకు సూచించారు. జనవరి 28వ తేదీ నుంచి ప్రమాదకరంగా భావించిన సంస్థలపై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 70 సంస్థలను పరిశీలించారు. అందులో 3 ఇన్‌స్టిట్యూషన్లు, 2 హాస్పిటల్స్, 3 మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాలు, 26 కమర్షియల్, 27 మర్కంటైల్, 3 అసెంబ్లీ, 2 బిజినెస్, 1 రెసిడెన్షియల్, 1 ఇండస్ట్రీ, 1 మల్టీప్లెక్స్, 1 మాల్ ఉన్నట్లు తెలిపారు. తనిఖీల సందర్భంగా యజమానులు, అద్దెదారులు, ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రజలు ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని డీజీ విక్రమ్ సింగ్ మాన్ విజ్ఞప్తి చేశారు.






