BRS Party : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది కేసీఆర్ మాత్రమే : బీఆర్ఎస్ పార్టీ

by Muthe.Rajitha |

భారత రాష్ట్ర సమితి(BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)ను తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడిగా పేర్కొంది ఆ పార్టీ.

BRS Party : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది కేసీఆర్ మాత్రమే : బీఆర్ఎస్ పార్టీ
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రాష్ట్ర సమితి(BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)ను తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడిగా పేర్కొంది ఆ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష అని కొనియాడుతూ.. BRS పార్టీ అధికారిక X ఖాతా పోస్ట్ చేసింది. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి అంశాలపై అవినీతి ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నా.. కేసీఆర్ ప్రజాదరణను దెబ్బతీయలేవని, తెలంగాణ ప్రజలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపింది.

కాగా ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం.. ఆ పార్టీలో ఉన్న అంతర్గత పోరును బయట పెట్టింది. కేసీఆర్ పై ఆయన సొంత కూతురే వ్యతిరేకతను వ్యక్తం చేసింది అంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. గులాబీ బాస్ నోరు విప్పకపోవడంపై కూడా పలు పార్టీల నేతలు, మీడియా జోరుగా చర్చలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంటూ పోస్ట్ పెట్టడం గమనార్హం.

Next Story