బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, అల్లైడ్ హెల్త్ కోర్సులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ గడువు పెంపు

by Naga Rani Yarlagadda |

కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది.

బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, అల్లైడ్ హెల్త్ కోర్సులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ గడువు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. ఇంతకుముందు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు చివరి తేదీగా ప్రకటించారు. ఇప్పుడు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ ప్రకటించింది. యూనివర్సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు వెబ్‌సైట్ https://alliedhs.tsche.in ద్వారా నిర్దేశిత గడువులోపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసి, అవసరమైన సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాలని యూనివర్సిటీ సూచించింది. రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ సబ్మిషన్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842136688, 9059672216 నంబర్లకు సంప్రదించవచ్చు. వెబ్ ఆప్షన్లకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూల కోసం [email protected] కు మెయిల్ చేయొచ్చు. ఇతర వివరాలకు 7901098840, 9490585796 నంబర్లలో సంప్రదించవచ్చు. పేమెంట్ గేట్‌వే సమస్యల కోసం 9618240276 నంబర్ అందుబాటులో ఉంటుందని యూనివర్సిటీ స్పష్టం చేసింది.

Next Story