ఆన్లైన్లో గుర్రపు పందేల బెట్టింగ్‌.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

by Naga Rani Yarlagadda |

ఆన్‌లైన్‌లో గుర్రపు పందేల బెట్టింగ్ నిర్వహిస్తోన్న అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆన్లైన్లో గుర్రపు పందేల బెట్టింగ్‌.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో గుర్రపు పందేల బెట్టింగ్ నిర్వహిస్తోన్న అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ పోలీసులు దమ్మాయిగూడలో సోదాలు నిర్వహించగా.. ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తోన్న నలుగురు సభ్యుల ముఠా పట్టుబడింది. నిందితులను తోకల నగేశ్, వెంకయ్య చౌదరి, చల్లా రమేశ్ బాబు, సునీల్ లుగా గుర్తించారు. వీరు షైన్ వెల్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో 105 మందితో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి.. పలువురి నుంచి రూ.8.34 కోట్లు కాజేశారని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి రూ.2 లక్షల క్యాష్, మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story