అన్‌లైన్ గేమింగ్.. ఫినో పేమెంట్ బ్యాంక్ సీఈవో,ఎండీకి 14 రోజుల కస్టడీ

by Ramesh Naini |

ఫినో పేమెంట్ బ్యాంక్ సీఈవో,ఎండీ రిషి గుప్తాను అరెస్టు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ కార్యాలయం వెల్లడించింది.

అన్‌లైన్ గేమింగ్.. ఫినో పేమెంట్ బ్యాంక్ సీఈవో,ఎండీకి 14 రోజుల కస్టడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్నేషనల్ అన్‌లైన్ గేమింగ్ సిండికేట్ రూ.13 వేల కోట్ల లావాదేవీలకు సంబంధించిన కేసులో భాగంగా ఫినో పేమెంట్ బ్యాంక్ సీఈవో,ఎండీ రిషి గుప్తాను అరెస్టు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్‌ ఎకానామికల్ ఆఫెన్స్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు డీజీజీఐ పేర్కొంది. జ్యుడీషియల్ కస్టడీ, అరెస్ట్ వివరాలు ఆదివారం డీజీజీఐ వెల్లడించింది. ఫినో బ్యాంక్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్‌తో మొత్తం డబ్బు రూ. 3 వేల కోట్లలో దాదాపు రూ. 840 కోట్లు జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డట్లు గుర్తించింది. అక్రమ నిధులలో రూ.3వేల కోట్లు డమ్మీ మర్చంట్ ఖాతాలకు, షెల్ కంపెనీల ద్వారా ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు మళ్లించినట్లు డీజీజీఐ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నిషేధిత గేమింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయానికి ఇన్వాయిస్ లేకుండా సేవలందించడం ద్వారా రూ.840 కోట్ల జీఎస్టీ ఎగవేత జరిగినట్లు పేర్కొంది.

ఫిబ్రవరి 26వ తేదీన ఫినో పేమెంట్ బ్యాంక్ ముంబై కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న డీజీజీఐ అధికారులను అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఫినో పేమెంట్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. విచారణ కేవలం బిజినెస్ పార్టనర్స్ కు సంబందించినది... బ్యాంక్ జీఎస్టీ కంప్లైయన్స్ కు సంబంధం లేదని వెల్లడించింది. అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించి సీఎఫ్‌వో కేతన్ మర్చంట్‌ను తాత్కాలిక సీఈవో నియమించినట్లు వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ షేర్లు 7.5శాతం పడిపోయినట్లు తెలిపింది.

Next Story