- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుళ్లిన కూరగాయాలు, కాలం చెల్లిన ఆహారపదార్థాలు
కుళ్లిన కూరగాయాలు, కాలం చెల్లిన ఆహారపదార్థాలు

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో ఫుడ్, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం సర్వసాధారణం అయింది. అయితే.. ఆన్‌లైన్‌లో కొనుగోలు వల్ల ఎంత సమయం ఆదా అవుతుందో.. అంతే నష్టం జరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కుళ్లిన కూరగాయలు, ప్రూట్స్.. ఎక్స్‌పెరీ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలు సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా కుళ్లిన ప్రూట్స్, ఎక్స్‌పెరీ డేట్ అయిపోయిన పదార్థాలను గుర్తించారు. 76 కిలోల కుళ్లిన కూరగాయలు, కాలం చెల్లిన ఆహారపదార్థాల్ని అక్కడే బయటకు విసిరి పారేయించారు. మొత్తం 32 సంస్థలకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఈ మధ్య మరింత కాస్ల్టీగా మారాయి. స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్‌పిన్ వంటి సంస్థల ఛార్జీలు మరింత పెంచాయి. దీనికితోడు డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వర్తించనుండడంతో వినియోగదారులపై అదనపు ధరల భారంతో సతమతమవుతున్నారు.






