Telangana Cabinet: ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై చర్చ

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్(Telangana Cabinet) సమావేశం కొనసాగుతోంది.

Telangana Cabinet: ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్(Telangana Cabinet) సమావేశం కొనసాగుతోంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Illu), భూ భారతిపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణపై కూడా చర్చ చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు సమస్యలు, రైతు భరోసా స్కీమ్ నిధుల విడుదల తేదీపై క్లారిటీ, బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే పెండింగ్ డీఏ విడుదల అంశంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే బుధవారం నాడు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో వారు అనేక అంశాలపై చర్చించారు. దీంతో నేటి కేబినెట్ భేటీ తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఒకటి లేదా రెండు పెండింగ్ డీఏలపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. వీటితో పాటుగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, భూభారతి చట్టం అమలు, భూదాన్ భూముల వ్యవహారంతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్ట్‌ల గురించి కేబినెట్ భేటీలో చర్చ చేస్తున్నట్లు సమాచారం.

Next Story