Kaushik Reddy: అసెంబ్లీలో నా ఫేవరెట్ క్లిప్స్! ఎక్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీడియో

by Ramesh Naini |   (  Updated:2025-03-11 07:03:08  IST  )

అసెంబ్లీలో నా బెస్ట్ క్లిప్స్ అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

Kaushik Reddy: అసెంబ్లీలో నా ఫేవరెట్ క్లిప్స్! ఎక్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో నా బెస్ట్ క్లిప్స్ అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) తాజాగా ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న రీల్స్ వీడియోను షేర్ చేశారు. అసెంబ్లీ నుంచి నాకు ఇష్టమైన క్లిప్‌లలో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. కమాన్ బీఆర్ఎస్ఎల్‌పీ.. తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీలో పోరాటానికి సిద్ధం అవుదామని ట్వీట్ చేశారు. ఈ వీడియో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారి హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాల సమాచారం.

Next Story