- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల భద్రత–బాలల సంరక్షణపై ఒక నిమిషం చలనచిత్రోత్సవం
చట్టాలు బలపడినప్పటికీ మహిళలు, పిల్లలపై నేరాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, నిజమైన మార్పునకు మనస్తత్వం మారాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల భద్రత, బాలల సంరక్షణపై సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీసుల మహిళల భద్రత విభాగం, యూనిసెఫ్, అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా కళాశాలల భాగస్వామ్యంతో ఒక నిమిషం చలనచిత్రోత్సవం ప్రదర్శనకు ఔత్సహికులను ఆహ్వానిస్తున్నట్లు ఉమెన్ సెఫ్టీ ఏడీజీపీ చారుసిన్హా తెలిపారు. చట్టాలు బలపడినప్పటికీ మహిళలు, పిల్లలపై నేరాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, నిజమైన మార్పునకు మనస్తత్వం మారాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ఈ మార్పులో యువత కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులు, యువ చలనచిత్రకారులు ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. చిత్రాల నిడివి ఒక నిమిషం ఉండాలని, ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో రూపొందించవచ్చని, ఏఐ టూల్స్ ఉపయోగించరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 30 మాస్ కమ్యూనికేషన్ కళాశాలలను భాగస్వాములుగా చేస్తూ, మార్చి 9న అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.






