- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఒకరు మృతి చెందారు. మంగళవారం కల్తీ కల్లు తాగటం వల్ల మొత్తం 16 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మంగళవారం కల్తీ కల్లు తాగటం వల్ల మొత్తం 16 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వారిలో ముగ్గురు పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మరో పదమూడు మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఒకరు ఇంట్లోనే మరణించగా మరో ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు తులసిరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. చనిపోయినవారంతా హెచ్‌ఎంటీ హిల్స్ సాయిచరణ్‌కాలనీకి చెందినవారుగా సమాచారం. ఇదిలా ఉంటే బాధితులంతా నిరుపేద కూలీలు అని తెలుస్తోంది. కల్లు తాగిన అనంతరం విరేచనాలు అవ్వడం, లో బీపీ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతకు గురైనవారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
Next Story






