ఒకప్పుడు ఎలిజబెత్ క్వీన్.. ఇప్పుడు లిక్కర్ క్వీన్.. కవితపై జీవన్ రెడ్డి ఫైర్ (వీడియో)

by Disha Web Desk 4 |
ఒకప్పుడు ఎలిజబెత్ క్వీన్.. ఇప్పుడు లిక్కర్ క్వీన్.. కవితపై జీవన్ రెడ్డి ఫైర్ (వీడియో)
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఎనకట ఎలిజబెత్ క్వీన్ ఉండే ఇప్పుడు కొత్తగా లిక్కర్ క్వీన్ వచ్చిందంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పట్టణంలోని 22 వార్డులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఆడపడుచులకు ఉద్బోధ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బతుకమ్మపై బొడ్డెమ్మకు బదులు విస్కీ బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడతారని విమర్శించారు. ఎంపీగా కవిత పార్లమెంట్ పరిధిలో చేసింది ఏమీ లేదన్నారు. బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను మూసేయించిన ఘనత కవితకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి గానీ రాహుల్ గాంధీ గురించి గానీ మాట్లాడే అర్హత కవితకు లేదని చురకలంటించారు.

Next Story

Most Viewed