- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1994లోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అందెశ్రీ.. ఎవరివల్ల బతికారంటే?
తెలంగాణ రాష్ట్రగీతం జయజయహే తెలంగాణ రచయిత, ఉద్యమకారుడు అందెశ్రీ అకస్మాత్తుగా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ సోమవారం ఉదయం ఉన్నట్టుండి కిందపడిపోయారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రగీతం జయజయహే తెలంగాణ రచయిత, ఉద్యమకారుడు అందెశ్రీ అకస్మాత్తుగా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ సోమవారం ఉదయం ఉన్నట్టుండి కిందపడిపోయారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారు. తెలంగాణ సాహితీలోకంలో ఓ వెలుగు వెలిగిన అందెశ్రీ కన్నుమూయడంతో ప్రముఖులు, కవులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక అందెశ్రీ మరణించడంతో ఆయనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
నిజానికి అందెశ్రీ 1994లోనే బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలోనే యలమంచి శేఖర్ సినిమాల్లో పాటలు రాసే అవకాశం కల్పించారని తెలిపారు. తరవాత అందెశ్రీకి సినిమాల్లో విప్లవ పాటలు రాసే అవకాశం వచ్చింది. నారాయణమూర్తి నటించిన చాలా సినిమాలకు అందెశ్రీనే పాటలు రాశారు.
ఆయన రాసిన బతుకమ్మ సినిమా పాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తున పైకి లేచేలా చేశాయి. అందెశ్రీ ప్రపంచంలోని మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైలునది లాంటి నదుల వెంట ప్రయాణిస్తూ నదులపై కవిత్వం రాసేందుకు ప్రపంచం అంతా తిరిగారు. తన పాటలకు, రచనలకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. అనాధగా ఎన్నో కష్టాలను అనుభవించి గొర్రెల కాపరిగా, కూలిగా పనిచేసి కవిత్వంతో డాక్టరేట్ అందుకునే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయన మరణించడంతో కవితాలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
READ MORE ....






