- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Teenmar Mallanna: బీసీల కోసం రెడ్లు, వెలమలు ప్రాణాలిచ్చినా అభ్యంతరం లేదు: తీన్మార్ మల్లన్న
బీసీలకు తెలంగాణలో ఉన్న రెడ్లు, వెలమలకు ఎప్పుడో బంధం తెగిపోయిందని ఇక మీతో సోపతే వద్దు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు తెలంగాణలో ఉన్న రెడ్లు, వెలమలకు ఎప్పుడో బంధం తెగిపోయిందని ఇక మీతో సోపతే వద్దు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ కలలుగన్న బీసీ రాజ్యం కోసం బీసీ జేఏసీ (BC JAC) నడుము కట్టి ముందుకు వస్తున్నదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాల్లో బీసీ జేఏసీ తరఫున అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పారు. ఇవాళ నిజామాబాద్ లో నిర్వహించి బీసీ జేఏసీ సమావేశానికి హజరైన మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చరిత్రలో మొట్టమొదటి సారి బీసీలకు రిజర్వేషన్లు (BC Reservation) ఇవ్వాలని రెడ్లు, వెలమలు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని నిజానికి ఆ ధర్నా వాళ్లు చేయలేదని బీసీల చైతన్యమై వాళ్లతో ఆ ధర్నా చేయించిందన్నారు. ఇది బీసీల సత్తా అని అన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు ఆ తర్వాత రెడ్లు అధికారంలోకి వచ్చేందుకు మా బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలే పోయాయని ఇప్పుడు బీసీలు అధికారంలోకి రావడం కోసం రెడ్లు, వెలమలు ఆత్మబలిదానం చేసుకున్నా అంగీకరిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అడ్డుకుంటే బీజేపీకి ఉరితాడు:
బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఇది భవిష్యతో బీజేపీకి ఉరితాడుగా మారుతుందని హెచ్చరించారు. కేసీఆర్ నోటి నుంచి ఇప్పటి వరకు బీసీ అనే పదం రాలేదని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లోని అగ్రవర్ణాలంతా ఒకతాను ముక్కలేనని విమర్శించారు. విష సర్పాలు ఒక పుట్ట నుంచి మరో పుట్టలోకి మారినంత మాత్రాన దాని విషయం పోదని అలాగే అగ్రవర్ణాల నాయకులు పార్టీ మారినంత బీసీలకు న్యాయం జరగదన్నారు. నిజామాబాద్ జిల్లా అగ్రవర్ణాల చెర నుంచి విముక్తి కావాలన్నారు. మా ఓట్లు మీకు వద్దు, మీ ఓట్లు మాకు వద్దన్నారు. గ్రామాల్లో 2028లో బీసీలే రాజ్యాధికారంలోకి వస్తారన్నారు. త్వరలోనే బీసీ రాజకీయ పార్టీ రాబోతున్నదని ఆ పార్టీతోనే అగ్రవర్ణ పార్టీలతో పోటీ పడబోతున్నామని చెప్పారు. కవితకు మాకు ఏం సంబంధం ఆమె వెలమ వ్యక్తి, కవిత బీసీ ఉద్యమాలు తన తండ్రి అధికారంలో ఉండగా చేయాల్సిందన్నారు.






