- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కరోజే గడువు ఇస్తున్నా.. మరుసటి రోజు కాల్చిపడేస్తా: జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన ప్రకటన
పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న పొల్యూషన్ వాటర్ (కాలుష్య) నివారణకు కంపెనీ యాజమాన్యాలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోకుంటే వచ్చే ఆదివారం 11 గంటలకు ఫ్యాక్టరీని కాల్చి వేస్తాను అని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, జడ్చర్ల: పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న పొల్యూషన్ వాటర్ (కాలుష్య) నివారణకు కంపెనీ యాజమాన్యాలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోకుంటే వచ్చే ఆదివారం 11 గంటలకు ఫ్యాక్టరీని కాల్చి వేస్తాను అని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం వీడియో విడుదల చేశారు. అరబిందో ఫ్యాక్టరీ నుండి కాలుష్య జలాలు విడుదల అవుతుండడం వల్ల కంపెనీ చుట్టుపక్కల రైతుల పంట పొలాలు దెబ్బ తినడంతో పాటు.. ముదిరెడ్డిపల్లి, తదితర గ్రామాలలో చెరువుల నీళ్లు కలుషితమవుతున్నాయి. దీనివల్ల చేపలు మరణించడం, పశువులు, గొర్లు, మేకలు ఇబ్బందులకు గురి కావల్సివస్తుందని.. కాలుష్య జలాల నివారణకు చర్యలు తీసుకోకుంటే కంపెనీని కాల్చి వేస్తానని గతంలో ఓ మారు హెచ్చరించిన విషయం పాఠకులకు విధితమే.
కంపెనీ తగిన చర్యలు తీసుకోకుండా కాలుష్య జలాలను యథావిధిగా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాలలోనూ ప్రస్తావించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే చర్యలు తీసుకోవాలని అయినా డిమాండ్ చేశారు. ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం మరోసారి ఎమ్మెల్యే అరబిందో కంపెనీ యాజమాన్యం.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై ఘాటుగా విమర్శలు చేశారు. అరబిందో కంపెనీ.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కుమ్మక్కై రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా.. పొల్యూట్ వాటర్‌ను విడుదల చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, అరబిందో కంపెనీ యాజమాన్యానికి ఒకరోజు సమయం ఇస్తున్నాను. పరిస్థితిని చెక్క దిద్దితే సరి.. లేదంటే ఆదివారం 11 గంటలకు కంపెనీని కాల్చి వేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇప్పటికే వేల లక్షల కోట్లు.. సంపాదించారు ఇక చాలు. నా నియోజకవర్గ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు అని ఆయన హెచ్చరించారు.






