మరోసారి జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద.. 29 గేట్లు ఎత్తివేత

by Malleboina Mahesh |

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కృష్ణా నదిలో వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుంది.

మరోసారి జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద.. 29 గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కృష్ణా నది (Krishna river)లో వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుంది. భారీ వర్షాలు కురవడంతో జులై నుంచి భారీ వరదలు వచ్చాయి. దీంతో కృష్ణా నదిపై ఉన్న అన్ని జలాశయాలు (Reservoirs) నిండిపోయాయి. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదే పరిస్థితి గత మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరోసారి కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో.. జూరాల ప్రాజెక్టు (Jura Project)కు వరద పోటెత్తింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు శనివారం అర్ధరాత్రి 29 గేట్లను ఎత్తి (Lifting of 29 gates) ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project)లోకి వదులుతున్నారు. జూరాలకు ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2,40,000 క్యూసెక్కులు వస్తుండగా.. 29 గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2,36,425 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ప్రస్తుత నీటి మట్టం 318.070 మీటర్లు కొనసాగుతుంది.

Next Story